ఆశ్రమం

సద్గురు శ్రీ ఖాదర్ భగవాన్

పీఠాధిపతి,
బద్వేల్

సద్గురు శ్రీ సుబ్బదాసు స్వామి

పీఠాధిపతి,
రాజంపేట

సద్గురు శ్రీ కేశవానందస్వామి

పీఠాధిపతి,,
వేదాంతపురం, తిరుపతి

శ్రీ మధు(మాధవదాసు)

పీఠాధిపతి(ప్రస్తుతం),,
వేదాంతపురం, తిరుపతి

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

విశ్వ చైతన్య ఆశ్రమం కి   స్వాగతం

శ్రీ గురుభ్యోనమః గురుబ్రహ్మ గురువిష్టుః గురుదేవో మహేశ్వరః గురసాక్షాత్‌ పరబ్రహ్మ తసై ్మశ్రీ గురువేనమః ఓంకారము నుండి సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపడైన పరమాత్ముడు మొట్టమొదట సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. అప్పుడు పరబ్రహ్మ తన ఆత్మస్వరూపం అయిన ఓంకారము నుండి ఆదిశక్తి జగ్మాతను సృష్టించాడు. అప్పుడు పరబ్రహ్మ జగన్మాత ద్వారా ఈ బ్రహ్మాండాన్ని (ప్రకృతి విశ్వప్రపంచం) సృష్టించాడు. ఈ సృష్టిని పరిపాలన చేయాలంటే దానికి తగినటువిం వారిని నియమఇంచాలని ఏర్పాటు చేసినాడు. తన నిరాకారమైన ఓంకారము గురించి తన విస్వరూపమైన ఆత్మను గురించి సృష్టి బ్రహ్మాండం పిండాండం గురించిసత్యము ధర్మము తనలో ఐక్యత చెందడానికి సర్వులకు బోధించి నేర్పించి మార్గమును చూపించడానికి సప్తఋషులను ఏర్పాటు చేసినాడు. ఈ సృష్టిని ఏర్పాటు చేసి వాి పోషణకు తిరిగి లయం కావడానికి బ్రహ్మ (సృష్టి) విష్ణువు (స్థితి) శివుడు (లయ)కారకులుగా వీరికి సహాయకులుగా ఆదిశక్తి బిడ్డలైన సరస్వతి బ్రహ్మను లక్ష్మి విష్టువును పార్వతి శివుడును వివాహము చేసుకొని పై కార్యక్రమములను నడపడానికి నియమించాడు. అలాగే సూర్య చంద్రులను పంచభూతాలను నవగ్రహాలను రాశులను దేవుళ్ళను దేవతలను వీరి ద్వారా ఈ జగత్తును పరిపాలన చేయడానికి నియమించాడు. ఈ విశ్వమును బ్రహ్మాండాన్ని పరమాత్మశక్తితో జగన్మాత ద్వారా సృష్టి కారకుడిగా అయిన బ్రహ్మ పంచభూతాలు (భూమి నీరు అగ్ని వలియువు ఆకాశం) సాయముతో ప్రకృతిని సృష్టి చేసి ఇందులో లక్షల జీవరాశులను సృష్టించాడు. అనేక రకములైన వృక్షాలు కొండలు గుట్టలు హిమాలయాలు మంచుకొండలు యందు ప్టుిన జలరాశులు క్రిమి కీటకములు మృగ పశువర్గములు పక్షి వర్గమములు మనుష్యజాతి (మానవులు)గా మొత్తం లక్షల జీవరాశులను బ్రహ్మ సృష్టించాడు. ఈ మొత్తము జీవరాశులకు పంచభూతాల సాయంతో ఆహారాన్ని అందిస్తూ పెంచి పోషిస్తున్నాడు విష్టువు. ఈ జీవరాశుల యొక్క స్థితిగతులను బ్టి వాి కర్మానుసారు అన్నిని తనలో లయం చేసుకుంటున్నాడు శివుడు. అలాగే సూర్య చంద్రులు పంచభూతాలు వీరి ఆధారమతో ఈ బ్రహ్మాండాన్ని లక్షల జీవరాశుల యొక్క పిండాండాన్ని పరిపాలిస్తున్నారు. ఈ లక్షల జీవరాశులు ఒక్కొక్క జన్మలో చేసినటువిం పుణ్య పాప కర్మ ఫలాలను వారి వారి కర్మానుసారము కష్టసుఖాలు లాభనష్టాలు దుఃఖాలు సమస్యలు ఆరోగ్యం అనారోగ్యం బ్రతికించుట చంపుట హింస అహింసలు భూమి నీరు గాలి అగ్ని ఆహారమ ఇల్లు వస్తువులు వాహనాలు పదవులు ఉద్యోగాలు వ్యాపారాలు అనేకమైన జీవ వృత్తులు కలిగిన మనుషులు తల్లి తండ్రి గురువు దైవం భార్య భర్త పిల్లలు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు బంధువులు స్నేహితులు సమాజంలో అప్పికప్పుడు సహాయ పడే మనుషులు మిగతా జీవరాశులు చివరగా జననమరణాలు అవి అన్నియూ వారు చేసుకున్న కర్మలు. (సంచిత కర్మ ప్రారబ్ద కర్మ ఆగామికర్మ) బ్టి ఈ కర్మఫలాలకు నక్షత్రాలు నవగ్రహాలు రాశులు అధిపతులుగా వుండి వారు చేసినటువిం పుణ్య పాప కర్మలు జననమణాలు ఇస్తూ అనుభవింప చేస్తూ వుాంరు. ఈ విధముగా లక్షల జీవరాశుల యొక్క ప్రక్రియ జరుగుతూ వుంటుంది. ఈ విశ్వ ప్రపంచంలో పైన చెప్పుకున్న పరిపాలన వున్న అధిపతులను లక్షల జీవరాశుల ప్రక్రియ మొత్తం జగత్తును తన ఆత్మ శక్తితో నడిపిస్తున్న పరబ్రహ్మ స్వరూపుడు అన్ని యందు సాక్షిగా వున్నాడు. ఈ విశ్వమంతట సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు అన్నీ జీవరాశులు యందునూ వున్నాడు. ఈ విశ్వమంతయూ తనలోనే వుంది. అంటే ఈ విశ్వానికి బయట లోపల నిరాకారంగా ఓంకారంగా పరమాత్ముడు వున్నాడు. అంతా వున్నా ఆ పరమాత్ముడు జీవాత్మగా అన్నీ జీవరాశులు యందునూ మానవుల యందునూ వున్నాడు. అంతిలో వున్నా ఆ పరమాత్ముడు మన శరీరాన్ని దేవాలయంగా మార్చుకొని మనలోనే వున్నాడు. అనే సత్యమును గ్రహించే జ్ఞానము ఒక మానవుడికి మాత్రమే ఇచ్చినాడు. అందుకే మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. ఉన్నతమైనదిగా ఆ పరమాత్ముడు మనకు తెలియ చేసినాడు. అటువిం జ్ఞానము కలిగిన మానవ జన్మను మనకు ఎందుకు ఇచ్చాడంటే మనము లక్షల జీవరాశులలో అనేక జన్మలు ఎత్తి ఆయా జన్మలలో చేసినటువిం కర్మలను అనుభవిస్తూ జనన మరణాల చక్రములలో తిరుగుతున్నాము. మనము చేసిన కర్మల వలన ఇంకా అనేక జన్మలు ఎత్తి అనుబవించాలి. అంతం లేనటువిం ఈ కర్మలను ఒక మానవ జన్మ ద్వారా మాత్రమే అంతం చేసుకోగలుగుతాము. అందుకే ఎంతో కష్టపడితే గాని పుణ్యఫలం వుంటేనే ఈ మానవ జన్మ మనకు రాలేదు. మహనీయులు చెప్పేది మానవ జన్మ ఎత్తి వచ్చి వేరే పనులు అశాశ్వతమైనవి చేసుకుంటూ వున్నాము. వచ్చిన శాశ్వతమైన పని గురించి మరిచినాము. తన నిజస్వరూపమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేక ఈ కర్మ ఫలాలలో తగులు కుంటున్నాము అని చెప్పినారు. అందుకు మనకు నాలుగు మార్గాల ద్వారా దారి చూపించారు. కర్మయోగము భక్తియోగము ధ్యానయోగమును ఆచరించి తనలో వున్న పరమాత్మను దర్శించి అన్ని కర్మఫలాల నుంచి తొలగబడి ముక్కిని పొంది జీవాత్మగా వచ్చి ఈ మానవ శరీరంలో చేరి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నవారు పరమాత్ముడిలో ఒకటవుతున్నారు. అప్పికి మన కర్మఫలాలు భస్మమై జనన మరణాలు లేనటువిం స్థితికి చేరి తనంతట తాను ఈ మానవ శరీరాన్ని వదిలి పరమాత్ముడిలో చేరుకుాంరు. ఇది పరమాత్ముని యొక్క సృష్టి ప్రక్రియ. ఈ విషయం ఒక్క మానవులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ విశ్వంలో ఉన్నదంతా అశాశ్వతంగా భావించి శాశ్వతమైన తన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్ముని చేరడానికి ఆయన చూపిన మార్గము తారకమంత్రం రాజ యోగమాగ్రము ఈ మార్గము మనకు స్వయంగా పరమాత్ముడు చెప్పిన మార్గము. పరమాత్ముడు నియమించిన సప్తఋషులు (బృహద్వాశిష్ట మహర్షి అత్రిమహాముని గౌతమ మహర్షి కశ్యపు మహాముని భరద్వాజ మహర్షి జమదగ్ని మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర) వీరి ద్వారా ఈ మార్గము చూపించడము జరిగింది. మహర్షులు (సప్తఋషులు) ఈ మార్గము మానవులు వారి కర్మానుసారము వస్తారు కాబ్టి వారందరికి అవకాశం కల్పించాలని నాలుగు ఆశ్రమములు నియపించారు. బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థ ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమము సన్యాస ఆశ్రమము నియమించి వాి ద్వారా పరమాత్మను చేరడానికి మార్గము చూపించారు. ఈ నాలుగు ఆశ్రమ ధర్మములలో మానవులకు ఏవిధంగా ఆచరించి నడుచుకోవాలని తెలియ చేసినారు. ఈ మార్గములలో ఏ విధంగా ఆచరించి నడుచుకోవాలో స్వయంగా ఆ పరమాత్ముడు అవతారాలు ఎత్తి చూపించాడు. శ్రీరాములుగా శ్రీకృష్ట పరమాత్మగా వామనుడిగా నరసింహునిగా వెంకటేశ్వరస్వామిగా అవతారాలు ఎత్తి మార్గాన్ని చూపించారు. పరమాత్ముడు తన అవతారాలను ప్రతియుగములోను జన్మిస్తూ ఆ పరమ సత్యాన్ని మానవులకు తెలియ చేస్తూ ఆచరించి ధర్మాన్ని నిలబెడుతూ అధర్మాన్ని శిక్షిస్తూ వస్తున్నాడు. కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ అన్నీ యుగములలో మానవుని జన్మ వచ్చి ఎందరో మహనీయులు ఋషులు మహర్షులు యోగులు సిద్దులు అవధూతలుగా మారి గురుశిష్యులుగా వుండి ఈ సత్య మార్గాన్ని మానవులకు చూపించి అనేక మంది జీవన్ముక్తులు చేస్తూ వచ్చారు. ఈ తారకమంత్ర రాజయోగమును అనుసరించినవారిలో కొంతమంది ఉదా ః త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు శివుడు) సూర్యచంద్రులు నారదులు సీత లక్ష్మణుడు భరతుడు హనుమంతుడు విభీషణుడు పాండురాజు పాండవులు బలరాముడు రుక్మిణీదేవి సత్యభామ భీష్ముడు అష్టవక్రాముని కుచేలుడు అంబరీషుడు ప్రహ్లదుడు పరమాత్ముని అవతారాల్లో వచ్చిన ఆయన ఈ తారకమంత్రమును ధ్యానించి మహనీయులుగా మార్చి దాని యొక్క విశిష్టతను సత్యమును మనకు అందించాలని ఎంతో శ్రమించి కష్టపడి వారి ద్వారా గ్రంథాలను అందించారు. అందులో కొన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా భగవద్గీత వ్యాసమహర్షి ద్వారా మహాభారతం మహాభాగవతము (సంస్కృతంలో) తెలుగులో బమ్మెర పోతన నాలుగు వేదాలు ఉపనిషత్తులు వాిలో ముఖ్యమైనది. పది ఉపనిషత్తులు వేదవ్యాసుల ద్వారా పురాణములు వాల్మీకి మహర్షి రామాయణమును ఏసుక్రీస్తు బైబిల్‌ను అల్లా ఖురాన్‌ ను వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని రామానుజాచార్యులు విశిష్య అద్వైతాన్ని యోగ వేమన పద్యాల ద్వారా కపిల మహర్షి పతంజలి మహర్షి వీరందరు మానవ జన్మకు వచ్చినందుకు సత్యమైన శాశ్వతమైన ఆత్మసాక్షాత్కారాన్ని తారకమంత్రము ద్వారా ధ్యానించి పొంది వారి కర్మలను భస్మం చేసుకొని ఆ పరమాత్ముని దివ్యశక్తితో ఎంతో కృషి పట్టుదలతో ఈ గ్రంథములను మనకు అందించారు. వారి జన్మమును పూర్తి చేసుకోవడం కాకుండా అటువిం పరమసత్య మార్గాన్ని మనకు చూపించి వెళ్ళారు. అజ్ఞానముతో వున్న మానవులను జ్ఞానమార్గములో నడిపించాలని వారు కృషి చేసినారు. సప్తఋషులు ద్వారా వచ్చిన ఈ సత్య మార్గమును గురుశిష్యులుగా చేరి అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని వారి పరీక్షలకు తట్టుకొని దాదాపు అనేక సంవత్సరములు సేవ చేసి ఈ తారక మంత్రము పొందిన మానవుడు ఎంతో కష్టపడి సాధన ధ్యానాలు చేసి కృషి పట్టుదల వైరాగ్యముతో జన్మమును పూర్తి చేసుకున్నారు. మళ్ళీ జన్మించకుండా ఈ గురు సంప్రదాయం అన్ని యుగములలో సనాతనంగా వస్తూనే వున్నది. ఈనాి కలియుగంలో ఈ విశ్వంలో మనకు తెలిసి ఈ సత్యమార్గము అనుసరించి పాించి ఆచరించి మనకు మార్గదర్శకులుగా వున్న వారిలో కొంతమంది ఉదాః మహనీయులు వీరబ్రహేంద్రస్వామి సిద్దయ్య అన్నమయ్య కాళిదాసు రామదాసు ఆదిశంకరాచార్యులు చంథ్రేఖర సరస్వతి భగవత్పాదులు మోహర్‌బాబా గురునానక్‌ షిరిడీ సాయిబాబా రాఘవేంద్రస్వామి కైవారం నారాయణ స్వామి వెంకయ్యస్వామి కాశీనాయన అరవింద స్వామి ఓషో మాస్టర్‌ సి.వి.వి రామక్రిష్ణ పరమహంస వివేకానంద స్వామి రమణ మహర్షి గౌతమ బుద్దుడు ఇలా అనేక మంది మానవ జన్మ ఎత్తి పరమాత్ముని దర్శించి వారి పూర్వకర్మలను మొత్తాన్ని భస్మం చేసుకొని మహనీయులుగా మారి పరమ సత్యాన్ని బోధించి మాటల ద్వారా నడవడికల ద్వారా ఆచరణలో ప్టిె చూపి మానవులకు మార్గదర్శకులై చివరిగా తనంతట తానుగా ఈ శరీరాన్ని వదిలి సమాధి అయి శాశ్వతమైన పరమపదవి పొందినారు. సప్తకోి మహమంత్రములకు మూలమంత్రమైన ఈ తారక మంత్రమును సప్తఋషుల ద్వారా ఒకరి తర్వాత ఒకరు గురుశిష్య పరంపరంగా తారకమంత్రాన్ని ఉపదేశిస్తూ కొనసాగుతూ వున్నది. ఈ పరమసత్యమైన తారక మంత్రమును ప్రమాణం ద్వారా ఉపదేశం పొందిన వారు సర్వాంతర్యామిగా వున్న పరమాత్ముడు తనలోనే వున్నాడని భగవంతుడు ఏ ఒక్క గుడిలోనే కాదు అంతా వున్నావాడే తనలోనే అటువిం గురువును మానవుడు శోధించి పరిశోధించి ఆలోచించి ఈ గురువు ద్వారానే అయితే మనము తప్పనిసరిగా పరమాత్ముని చేరుకోగలము అని నమ్మకం కుదిరినప్పుడు వెనకడుగు వేయకుండా అటువిం గురువు దగ్గర చేరి సేవచేసి తారక మంత్రమును పొంది ధ్యానించి సాధనము చేసి బంధింపబడిన కర్మఫలాల నుండి బయటపడి ఆత్మసాక్షాత్కారము పొందవలయును. సప్తఋషులు ద్వారా ఈ విశ్వంలో నాలుగు ఆశ్రమ ధర్మాలను పాిస్తూ అన్ని యుగాలుగా వస్తూ సనాతనంగా వస్తున్న పీఠంలో ఆశ్రమములో పరంపర చూసి వెనతికి గుర్తించి పరిశోధించవలెను. ఈ విశ్వంలో అనేక దేశములలోను మన భారతదేశంలోనూ అనేక పీఠాలు ఆశ్రమములో శాఖోపశాఖలుగా విస్తరింపబడి వున్నాయి. ఈ పీఠాలు మఠాలు ఆశ్రమముల వారందరూ చెప్పేది ఆ పరమసత్యాన్ని గురించి కాబ్టి దారులు వేరైనా గమ్యం ఒక్కటే పరమాత్ముని చేరడానికి ఏ గురువైనా ఒక్కటే. కాబ్టి వాి మూలాలను వంశ పరంపరను మంత్రం ఇచ్చే గురువులను తప్పనిసరిగా వారి మాటలను బోధనలను సత్యము ధర్మములను అనుసరించి నడుచుకుంటున్నారా లేదా అని గుర్తించి ఆలోచించి పరిశోధించి పూర్తి నమ్మకము కుదరాలి. ఈ విశ్వంలో వున్న అన్ని దేశాలలోనూ మన భారతదేశంలో వున్న పీఠాలు ఆశ్రమములు మఠాలు ఏవైనా అక్కడ మంత్రోపదేశం చేస్తున్న ఏ గురువు దగ్గరైనా మనము నమ్మకంగా చేరవచ్చును. ఈ పీఠములోనే పొందాలి ఈ గురువు దగ్గర చేరాలి లేకపోతే పరమాత్ముని చేరుకోలేము అనేది మన అపోహ మాత్రమే. సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు ఒక్కడే అన్ని జీవులలో మానవులలో వున్నప్పుడు ఇంక జాతి కులములు మతములు ఇంకెక్కడున్నాయి. అప్పుడు మనలో ద్వేషములు బేధములు వుండవు మనము ఆ పరమాత్ముని అందరిలో చూడగలిగినప్పుడు సత్యమైన గురువు దగ్గర మనస్పూర్తిగా నమ్మకముగా చేరవచ్చును. ఇవన్ని ఎందుకు చెప్పవలసివచ్చిందంటే మనము బాహ్యములో ఒక రూపాయి వస్తువు దగ్గర నుంచి అవి ఉదాః (చాక్ల్‌ె బిస్కెట్లు పండ్లు కూరగాయలు ప్రొవిజన్స్‌ గృహోపకరణాలు బట్టలు పెళ్ళి సంబంధాలు బంధువులు స్నేహితులు వాహనాలు ఇండ్లుఆహారములు మనము వాడే వస్తువులు ఇలా విలువగలిగినవి విలువ లేనివి ఏదైనా సరే మనము ఒకికి పది సార్లు ఎంచి చూచి ఎన్నుకుంటున్నాము. అశాస్వతమైన వీటన్నింకి అంతి విలువ ఇచ్చి ఎన్నుకుంటున్నాము మరి శాశ్వతమైన నిజస్థితి గలిగి ఆత్మ సాక్షాత్కారము పొంది మన కర్మలను బాపుకొని పరమాత్ముని మోక్షాన్ని పొందాలంటే అటువిం మార్గమును చూపించేటువిం నిజమైన సత్యమైన గురువును కూడా ఒకికి వందసార్లు పరిశీలించి శోధించి గుర్తించి మనస్పూర్తిగా నమ్మకముతో చేరితే ఇక వెకడుగు వెయ్యాల్సిన అవసరం వుండదు. ఇది సత్యము. విశ్వంలో వున్న మానవులు చాలామంది ఈ నిజస్థితిని తెలుసుకోలేక ఇహలోకంలో వున్నటువిం బాహ్యపరమైన అశాశ్వతమైన వాికోసం పాకులాడి అవి అన్యిశి తన సొంతం చేసుకోవాలని తారక మంత్రమును పొంది సాధన చేస్తూ వుండి కూడా తన కోరికలు ఆశలు సమస్యలు బాధలు అనారోగ్యాలు బంధాలు దూరమవడం కష్టాల్లో కూరుకుపోవడంతో అవన్నియూ మన కర్మానుసారము వచ్చాయని తెలుసుకోలేక ఇవన్ని నిజమనుకొని మాయలో పడి పొందినటువిం తారకమంత్రము ఉపయోగం లేదని మర్చిపోయి వృధా చేసుకొని దేనికోసము వచ్చామో దానికోసము ప్రయత్నం చేయకుండా ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన మానవ జన్మను వృధా చేసుకొంటున్నాము. ఈ జన్మ పోతే లక్షల జీవులలో ఏ జన్మ ఎత్తుతామో తెలియదు ఈ బాహ్యములో ఎంత కష్టపడి సంపాదించినా కూడబ్టెినా ధనము ఇల్లు బంగళాలు క్టినా అత్యున్నతమైన పదవులు పొందినా పేరు ప్రతిష్టలున్నా ఎంతమంది బంధువులు స్నేహితులు జనాలు వున్నా అవన్నియూ శ్మశానము వరకే తర్వాత మన ఇంిలో ఫోకు పరిమితమౌతాము. అందరు కొద్ది రోజులు గుర్తిపెట్టుకొని మరచిపోతారు. ఈ సృష్టి మొదలైనప్పినుంచి అన్ని యుగాలలో మానవులుగా జన్మించి సత్యమును ధర్మమును పాించి పరమ సత్యాన్ని తెలుసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందినవారి అనుభవంతో చెప్పిన మాటలు బోధనలు నడవడికలు ఆచారాలు ధ్యానాలు సాధనలు యోగాలు తపస్సులు నీతి వాక్యాలు పద్యాలు తత్త్వాలు భజనలు కీర్తనలు ఆనాి నుండి ఈనాి వరకు వచ్చిన గ్రంథములన్నీ మహనీయులు సంపాదింఛిన సత్యమైన సొత్తు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా సృష్టి అంతము వరకు ఆ సొత్తు వుంటుంది. అందుకే జీవాత్మ నుండి పరమాత్మ స్థితికి చేరుకున్న మహనీయులు ఆనాి నుండి ఈనాి వరకు ఎప్పికీ పూజింపబడుతున్నారు. వారు బాహ్యపరమైన ఇహానికి సంబంధించిన వాికోసం కష్టడలేదు. వారు పరానికి సంబంధించిన సత్యమైన పరమాత్మ దర్శనం కోసం కష్టపడినారు. కాబ్టి వారు గృహాలలో గుడులలోనూ పూజింపబడుతున్నారు. మిగతా మానవులను మర్చిపోతున్నారు. అందుకే వారికి వీరికి ప్రతిఒక్కరూ తేడా గమనించవలసింది. ప్రతి మానవులు గుర్తించుకోవల్సినవి పాించి ఆచరించవలసినవి తప్పని సరిగా గురువుల మూలకంగా సలహాలు సూచనలు తీసుకొని నడుచుకోవలెను. ప్రతి గృహస్థు కూడా వారి వృత్తులు కార్యక్రమాలు సంసారంలో వుంటూ కర్మానుసారం అన్ని అనుభవిస్తూ జన్మానికి వచ్చిన పని మర్చిపోకుండా నిత్యము ధాన సాధనాలు ద్వారా పరమాత్ముని తెలుసుకొని గమ్యము చేరడానికి పట్టుదలతో పనిచేయాలి. తామరాకు మీద నీి బొట్టు వలె సంసారంలో వుంటూ ఆ పరమపదవి పొందిన ఎందరో మహనీయులు మార్గదర్శకులుగా దారి చూపించివున్నారు. మనము వారిని అనుసరిస్తే చాలు కాబ్టి గృహస్థులు మహనీయులు యొక్క గ్రంథాలను బోధించిన వారి మాటలను వారి నడవడికను సత్‌ ప్రవర్తనతో మెలిగి ఆచరణలో ప్టిెతెలుసుకొని గృహస్తి ఆశ్రమ ధర్మాలను పాిస్తూ అందరికీ ఆదర్శవంతులుగా నిలబడి అనేక సాధనాలతో భక్తి మార్గములో నడుచుకుంటూ సాకారంగా మొదలై చివరకు నిరాకారంగా పరమాత్ముని దర్శించడమే మన జీవిత గమ్యం. తారకమంత్ర రాజయోగమార్గాన్ని ఈ బ్రహాండంలో మన మహర్షుల ద్వారా అనేక శాఖోపశాఖలుగా విస్తరింపబడ్డాయి. మన భారతదేశంలో కూడా అనేక పీఠములు శాఖలుగా వున్నాయి. అందులో ఒక పీఠము బృహద్వాశిష్ఠమహర్షి ద్వారా అచల సాంప్రదాయ పీఠముగా ఏర్పడి అన్ని యుగాలుగా సనాతనంగా వస్తూ వున్నాది. ఈ పీఠము యొక్క బృహద్వాశిష్ట వంశపరంపరలో గురుశిష్యులుగా బృహద్వాశిష్ట మహర్షి సూర్యభగవానుడు యాజ్ఞవల్కమహాముని జనక మహారాజు సులభుడు శుకమహర్షి పరీక్షిత్తు సాందీప మహాముని శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి ఉద్దవుడు శ్రీధర్‌ మహర్షి మంచుకొండ మస్తాన్‌ అచల గురు గాలాబు గురువర్యులు బద్వేలు శ్రీషేక్‌ హుస్సేన్‌ అచల గురు నాజర్‌ మస్తాన్‌ సుందరమాంబ చంద్రయోగీశ్వరులు బ్రహ్మంగారు శ్రీఖాదర్‌ బగవాన్‌ గారు రాజంపేట శ్రీ సుబ్బదాసు స్వామి గారు శ్రీకేశవానందస్వామి తిరుపతి బద్వేలు శ్రీషేక్‌ హుస్సేన్‌ బ్రహ్మంగారి నుండి ఇంకొక శాఖగా శ్రీ ఖాజావతి స్వామి, శ్రీ అబ్దుల్‌ అజీజ్‌ పాఖాద్రి, కమల్‌ఘోష్‌, శ్రీ మహమ్మద్‌ హుస్సేనుల్లా, షరీఫ్‌ పాఖాద్రి అను శ్రీ బ్రహాంనందస్వామి స్థాణకాస్వామి అలా గుంటూరు, తెనాలి, ప్రకాశం, కడప, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ విధంగా అచల సాంప్రదాయ పీఠము గురుశిష్యుల వంశపరంపరగా వస్తూవున్నది. శ్రీబద్వేల్‌ ఖాదర్‌ బగవాన్‌ గారు రాజంపేట శ్రీ సుబ్బదాసుస్వామి కూడా శిష్యత్వం ఇచ్చి తారకమంత్రమును బోధించి సత్య మార్గమును గురించి తెలియచేసి 24-01-1931 వ సంవత్సరం పుష్యశుద్ధ పంచమినాడు ఖాదర్‌ భగవాన్‌ స్వామి సమాధి అయినారు. తరువాత పీఠాధితులైన శ్రీ సుబ్బదాసు స్వామి కూడా గురువు గారి అడుగుజాడలలో నడుస్తూ వారి అజ్జానుసారము సత్యబోధనను వారి శిష్యులకు తెలియచేస్తూ వచ్చినారు. తాను కుటుంబంలో వుంటూ కర్మానుసారం వచ్చిన భార్య పిల్లలతో సంసారం చేస్తూ కూడా ఆశ్రమ శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ వచ్చారు. చిత్తూర జిల్లా, పుత్తూరు తాలూకా కమ్మపల్లి మండలంలో పారకాల్వ గ్రామంలో ముండ్లూర మునస్వామి నాయుడు తాయారమ్మ మొది సంతానము సుబ్బరామా నాయుడు రెండవ సంతానము శ్రీ కేశవానంద స్వామి మూడవ సంతానము పిచ్చెమ్మ ఆడబిడ్డ జన్మించారు. 1916 వ సంవత్సరం శ్రీ కేశవానంద స్వామి జన్మించారు. చిన్నప్పి నుండి భక్తి శ్రద్ధలతో భయభక్తులతో పెద్దల అడుగుజాడలలో నడిచేవారు. 10వ సంవత్సరము వరకు తల్లి దగ్గర గారాభంగా పెరిగారు. తరువాత చదువుకోవడానికి బడికి పంపిస్తే చదువుకోనని ఏడుస్తూ మారాం చేస్తూ దెబ్బలు తినేవాడు. ఇంి నుంచి స్కూల్‌కు పంపితే చెరుకుతోటల్లో, పొదల్లో, దాక్కొని స్కూల్‌కు పోకుండా ఇంికి తిరిగి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఇక లాభం లేదనుకొని విద్య అబ్బదని సొంత భూమిలో కూలీల దగ్గర వ్యవసాయం పనులు నేర్చుకొనేవారు. కొద్ది రోజులకు తండ్రి కాలం అయినాడు. తన అన్న అయిన సుబ్బరామ నాయుడు తన స్కూల్‌ చదువులు పూర్తి చేసారు. తండ్రి కాలానంతరము తండ్రి యొక్క ఇంి బాధ్యతలు తీసుకున్నారు. తన అన్న మాట వింటూ తనకు ఇంి పనులలో చేదోడువాదోడుగా వుంటూ వచ్చారు. ఎక్కువగా వ్యవసాయం పనులు చేస్తూ గడిపేవారు. ముందుగా అన్నకు వివాహం అయినది. అన్న అడుగుజాడలలో వుంటూ ఎక్కువగా ఊరిలో జరుగుతున్న భజన కార్యక్రమాలలో పూజల్లో శ్రీ కేశవానందస్వామి పాల్గొనేవారు. ఎదురైన కష్టాలలో బాధలలో వెనుతిరగకుండా సత్మమార్గము అనుసరించి పౌర్ణమి పూజలకు స్వామి వారి పర్యటనలకు సంచారమునకు తనతో పాటు వెళ్ళేవారు. తన సొంత భూమిలో పండిన పంటల్లో బియ్యం బెల్లం మిరపకాయలు చింతపండు కూరగాయలు మామిడి కాయలు ఏవైనా సరే పారకాల్వ నుండి తిరుపతి రైల్వే స్టేషనుకు మైళ్ళ దూరం బరువు మోసుకొనివచ్చి రైలులో వెల్ళి రాజంపేట లోని గురువు దగ్గరికి చేర్చేవారు అక్కడే రెండు మూడు రోజులు వుండి గురువు గారికి సేవ చేసుకొనేవారు. కేశవానంద స్వామి పరశురామయ్య మునస్వామి ఆచారి వీరు ముగ్గురు కలసి అన్నదమ్ముల వలె వుంటూ ఈ జ్ఞాన సంబంధమైన విషయాలు విచారించుకుంటూ శోధిస్తూ గురువు గారికి సేవలు చేసుకుంటూ వుండేవారు. తరువాత వారి అన్నదమ్ములు మరికొందరు కలసి వారికి వచ్చిన భూమి మొత్తం 19-02-1964 వ సంవత్సరము భాగపరిష్కారము చేసుకున్నారు. తనవా తీసుకొని సొంతంగా తన పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ వుండేవారు. తరువాత వారి అన్న సుబ్బరామ నాయుడు ఆరోగ్యం సరిగా లేక 21-11-1964వ సంవత్సరము కాలం అయినారు. బద్వేల్ శ్రీ ఖాదర్ భగవాన్ గారు తారక మంత్రమును శిష్యులకు ఉపదేశిస్తూ వచ్చారు. తరువాత రాజంపేట శ్రీ సుబ్బదాసు స్వామి శిష్యత్వం పొంది వారి ద్వారా పీటాధికారం పొందారు. శ్రీ ఖాదర్ భగవాన్ స్వామి 24-1-1931 సంవత్సరంలో పుష్య సుద్ద పంచమి నాడు సమాధి అయ్యారు. తరువాత పీఠాధిపతులైన శ్రీ సుబ్బదాసు స్వామి కూడా గురువు గారి అడుగు జాడలో నడుస్తూ వారి ఆజ్ఞానుసారం సత్యభోధనను వారి శిష్యులకు తెలియజేస్తూ వచ్చారు. తానూ కుటుంభంలో ఉంటూ కర్మానుసారం వచ్చిన భార్య పిల్లలతో సంసారం చేస్తూ కూడా ఆశ్రమ శిష్యులకు జ్ఞాన భోద చేస్తూ వచ్చారు. తరువాత శ్రీ కేశవానందస్వామి గారు 1962 సంవత్సరంలో శ్రీ సుబ్బదాసు స్వామి దగ్గర తారక మంత్రము తీసుకొని శిష్యరికం పొందారు. ఆనాటి నుండి గురు ఆజ్ఞ ప్రకారం తారక మంత్రమును ధ్యానిస్తూ సాధన చేస్తూ గురువు గారి సేవలలో, పౌర్ణమి పూజ, ఆరాధనా కార్యక్రమాలలో, సత్సంగాలలో పాల్గొంటూ వచ్చేవారు. 12-1-1970 వ సంవత్సరంలో శ్రీ సుబ్బదాసు స్వామి వారు పీటాధికారమును శ్రీ కేశవానందస్వామి గారికి అప్పగించారు. శ్రీ సుబ్బదాసు స్వామి 15-8-1974 సంవత్సరంలో శ్రావణ బహుళ త్రయోదశి నాడు సమాధి అయినారు. శిష్యులైన శ్రీ మధు(మాధవదాసు)కు 23-5-1995 సంవత్సరంలో తారక మంత్రమును ఉపదేశిస్తూ, పీఠాధికార భాద్యతను అప్పగిస్తూ, ఆశ్రయించిన భక్తులకు మంత్రమును ఉపదేశిస్తూ ఆశ్రమము నందు జరుగు కార్యక్రమాలను యధావిధిగా జరపవలెనని ఆజ్ఞాపించినారు. మిగులు శిష్యులందరిని మధు(మాధవదాసు)కి ఆశ్రమము యొక్క అన్ని కార్యక్రమాలలో సహకరించవలెనని ఆజ్ఞాపించారు. మధు(మాధవదాసు)కి తనను సమాధి చేయవలసిన స్థలమును చూపించి, చేయవలసిన పద్దతులను చెప్పినారు. ఆశ్వీయుజ మాసం సుద్ద విదియ సరియగు 2-7-1997 గురువారం సాయంత్రం 5 గంటల 15 నిముషములకు అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ నిశ్శబ్దముగా ఉండమని అందరికీ నమస్కారము చేసి యోగ నిష్ఠలోకి వెళ్లి తన తనువును వాడాలి పరమపదవిని పొందారు. గురువు ఆజ్ఞానుసారం ఆనాటి నుండి శ్రీ మధు(మాధవదాసు) గారు స్వామి వారు చేస్తున్న కార్యక్రమములు అన్నింటినీ యధావిధిగా ఆశ్రమ భక్తాదుల సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమ భక్తులందరికోసం ట్రస్ట్ (నెం: 16/2016) ను ఏర్పాటు చేసి తద్వారా పలు సేవాకార్యక్రమాలను చేస్తున్నారు.

విశ్వ చైతన్య ఆశ్రమం  కార్యక్రమాలు

We conduct several Activities & some Helpful programes